News June 27, 2024

ఎడపల్లి: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

image

ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన రఘుపతి శ్రీనివాస్ (35) గురువారం ఉదయం వారి కులస్తులతో కలిసి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకొని నీటిలో మునిగిపోయాడు. తోటి వారు రక్షించేందుకు చూసినా ఫలితందక్కలేదు. మృతుడి భార్య మమతా ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 19, 2026

ఎడపల్లిలో వివాహిత సూసైడ్

image

ఎడపల్లి మండల కేంద్రంలో వివాహవిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులతోనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు. వర్ని మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన వీర్ల శైలజకుఎడపల్లికి చెందిన వీర్ల సతీష్‌తో వివాహం జరిగింది. దుబాయ్ వెళ్లేందుకు రూ.లక్ష తీసుకురావాలని శైలజను సతీష్ వేధించాడు. వేదింపులు భరించలేక గురువారం శైలజ ఉరి వేసుకుంది.

News February 19, 2026

NZB: 58 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

image

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ప్రతిరోజూ ఉ. 9 గంటల నుంచి మద్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

News February 18, 2026

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న భవిత సెంటర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.