News April 17, 2025

ఎడపల్లి: బ్రాహ్మణపల్లిలో వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎర్రోళ్ల అనిత(35) సూసైడ్ చేసుకుంది. ఆమె బంధువులు కొందరు అవమానపరిచారని మనస్థాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

Similar News

News January 29, 2026

NZB: వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తాం: కలెక్టర్

image

పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న వారు నిర్ణీత గడువు లోపు బీ-ఫారం సమర్పించాలని, లేకుంటే వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తామని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. అభ్యర్థులు, అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళిని తు.చా తప్పకుండా పాటించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.

News January 29, 2026

నిజామాబాద్: ఎన్నికల ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అభ్యర్థులు లేదా ఓటర్లు తమ సమస్యలపై 08462-220183 నంబర్‌కు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలన్నారు. వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు జరిగితే ఈ నంబర్‌కు తెలపాలన్నారు.

News January 29, 2026

మేడారం జాతరలో నిజామాబాద్ సీపీ బందోబస్త్

image

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజులుగా మేడారం జాతరలో నిజమాబాద్ సీపీ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన వెంట పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.