News December 24, 2025
ఎడారిలో మంచు: ప్రకృతి ఇస్తున్న డేంజర్ సిగ్నల్!

సౌదీ ఎడారిలో మంచు కురవడం అందంగా అనిపించినా అది భూమి మనకిస్తున్న గట్టి వార్నింగ్. వాతావరణ మార్పుల వల్ల వేడి పెరగడమే కాదు ప్రకృతి గతి తప్పడం దీనికి అసలు కారణం. మన ఇండియాకూ ఇది ప్రమాద సంకేతమే. పెరిగిన ఎండలు, అకస్మాత్తుగా భారీ వర్షాలు, వరదలే ఇందుకు నిదర్శనం. ఇలాంటి విపత్తులు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. నగరాల నిర్మాణం, వ్యవసాయం పట్ల కొత్తగా ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 29, 2025
ముక్కోటి ఏకాదశి/వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో తెలుసా?

దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి వేళగా చెబుతారు. ఈ మధ్యలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మీ సమయంగా పేర్కొంటారు. ఈ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 30న వచ్చింది. ఆ రోజు మహా విష్ణువు మూడు కోట్ల దేవతలతో దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, ఉత్తరద్వారం నుంచి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.
News December 29, 2025
ఇంటర్ అర్హతతో 394 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

NDA, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్-2026కు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఈ పరీక్ష ద్వారా UPSC త్రివిధ దళాల్లో 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్ (MPC) ఉత్తీర్ణులు అర్హులు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. వెబ్‌సైట్: upsc.gov.in/ *మరిన్ని ఉద్యోగాలకు<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 29, 2025
IIT ధన్‌బాద్‌లో 105 పోస్టులు… అప్లై చేశారా?

<


