News January 5, 2026

ఎడిటెడ్ ఫొటోలపై ప్రతీకా ఫైర్.. Grok ఆన్సరిదే

image

ఎడిటెడ్ ఫొటోలను సృష్టిస్తున్న Grokపై మహిళా క్రికెటర్ ప్రతీకా రావల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా ఫొటోలను మార్ఫ్ చేేసే అధికారాన్ని నేను నీకు ఇవ్వలేదు. థర్డ్ పార్టీ అభ్యర్థనను తిరస్కరించు’ అని Grokకు స్పష్టం చేశారు. దీనికి చాట్‌బోట్ స్పందించింది. ‘నేను మీ గోప్యతను గౌరవిస్తాను. అనుమతి లేకుండా మీ ఫొటోలను ఎడిట్ చేయను’ అని పేర్కొంది. కొన్నిరోజులుగా సెలబ్రిటీల <<18765757>>బికినీ ఫొటోలు<<>> ట్రెండవుతున్న విషయం తెలిసిందే.

Similar News

News February 11, 2026

మరో కేసులో అంబటి రాంబాబుకు బెయిల్

image

AP: వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ రాగా, తాజాగా మెడికల్ కాలేజీల PPP విధానంపై ఆందోళనల కేసులో బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.

News February 11, 2026

ఆయిల్ పామ్: నత్రజని లోపం ఇలా గుర్తించండి

image

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.

News February 11, 2026

హంసలదీవి వేణుగోపాలస్వామి క్షేత్రం

image

కృష్ణాజిల్లా హంసలదీవిలోని వేణుగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనది. పుట్టలో ఉన్న స్వామికి ఆవులు పాలు కార్చడం చూసి, గోపాలురు నిప్పు పెట్టగా స్వామి విగ్రహం భిన్నమైందని జనశృతి. ఆ విగ్రహం పక్కనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి, సాగర సంగమంలో స్నానమాచరిస్తే సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఆలయం 1977 ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి వేలాది మందిని కాపాడింది.