News January 4, 2026

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియాలో పోస్టులు

image

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<>EdCIL<<>>) 15 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BBA, BA, BCom, B.Tech/BE, CA అర్హతగల వారు జనవరి 19 వరకు NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ.15వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in

Similar News

News January 5, 2026

ఎండోమెట్రియోసిస్ ఉంటే పిల్లలు పుట్టరా?

image

మహిళల్లో ఎండోమెట్రియల్ లైనింగ్ మందంగా ఉంటే నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, నొప్పి, స్పాటింగ్ వంటివి ఉంటాయి. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీని తీవ్రతను బట్టి గర్భధారణ సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారిలో అబార్షన్, ప్రీటర్మ్ డెలివరీ వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ✍️ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.

News January 5, 2026

ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స

image

ఎండోమెట్రియోసిస్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా పెల్విక్‌ నొప్పి, పీరియడ్స్‌లో నొప్పి, హెవీ బ్లీడింగ్, స్పాటింగ్, ప్రేగు కదలిక నొప్పి, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, సంతానలేమి ఉంటాయి. హార్మోన్‌ థెరపీ తీసుకోవడం కొన్నిసార్లు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇవి ఎండోమెట్రియోసిస్‌ కణాల వృద్ధిని నియంత్రణలో ఉంచుతాయి. కొందరిలో లాప్రోస్కోపిక్‌ సర్జరీ అవసరం పడుతుందంటున్నారు నిపుణులు.

News January 5, 2026

ఐఐటీ మండీలో 31 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>ఐఐటీ<<>> మండీలో 31 జూనియర్ లాబోరేటరీ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iitmandi.ac.in.