News March 12, 2025

ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?

Similar News

News September 19, 2025

బాపట్ల: రాజస్థాన్‌లో మన జవాన్ మృతి

image

బాపట్ల(M) వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన జవాన్ మేడిబోయిన దుర్గారెడ్డి రాజస్థాన్‌లో మృతి చెందినట్లు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ నుంచి మృతదేహం అంబులెన్స్‌లో శనివారం స్వగ్రామానికి రానుందని చెప్పారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News September 19, 2025

22 నుంచి కడపలో డిగ్రీ కాలేజీల బంద్..!

image

ఫీజు బకాయిల విడుదల కోసం డిగ్రీ విద్యా సంస్థలు బంద్ చేయాలని వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలన్నారు. ఫీజులు రాక కళాశాలలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 22 నుంచి బంద్ చేస్తామంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు బంద్ నోటీసులు ఇచ్చారు.

News September 19, 2025

HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

image

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.