News March 12, 2025

ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?

Similar News

News September 16, 2025

మంచిర్యాల జిల్లా వర్షపాతం వివరాలు

image

గడిచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలో 23.7మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా లక్షెట్టిపేట మండలంలో 84మి.మీ నమోదు కాగా.. జన్నారంలో 6.8, దండేపల్లి 44.2, హాజీపూర్ 78.2, కాసిపేట 19.8, తాండూర్ 17.4, భీమిని12.4, కన్నేపల్లి 2.6, వేమనపల్లి 14.6, నెన్నల 4.8, బెల్లంపల్లి 20.4, మందమర్రి 16.2, మంచిర్యాల 14.2, నస్పూర్ 11.2, జైపూర్ 10.8, భీమారం 2.4, చెన్నూర్ 24.8, కోటపల్లిలో 28.6మి.మీ నమోదైంది.

News September 16, 2025

‘ఆరోగ్యశ్రీ’ బంద్.. చర్చలకు అంగీకరించని సర్కార్

image

TG: ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఇప్పటికే ₹140 కోట్ల బకాయిల్లో ₹100 కోట్లు విడుదలయ్యాయి. 150 కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతాయి. ఎమర్జెన్సీ సేవలు అందుతాయి. మిగతా 330 చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాయి’ అని హెల్త్ మినిస్టర్ కార్యాలయ అధికారి Way2Newsకు తెలిపారు.

News September 16, 2025

నెల్లూరు: డీఎస్సీలో 16 మిగులు సీట్లు

image

నెల్లూరు జిల్లా నుంచి డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 673 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 657 మంది ఎంపికయ్యారు. 16 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.