News January 29, 2025
ఎనమాముల మార్కెట్ నూతన కమిటీ ప్రకటన

వరంగల్ ఎనమాముల మార్కెట్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్ ఛైర్మన్‌గా బండి జనార్దన్‌ను నియమించారు. మొత్తం 18 మందితో ఎనమాముల మార్కెట్ నూతన కమిటీని ప్రకటించారు. కమిటీలో రాజు, వాసుదేవ రెడ్డి, రుద్ర ప్రసాద్, శ్యాం, సబేరా, గోపాల్ రావు, ప్రదీప్ కుమార్, నాగరాజ్, సంపత్, భిక్షపతి, నరసింహ నాయక్ తదితరులు ఉన్నారు .
Similar News
News September 16, 2025
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మన దేశంపై ట్రంప్ 50శాతం టారిఫ్‌లు విధించిన తర్వాత తొలిసారి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఐదు విడతల్లో సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ ఇప్పటికే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
News September 16, 2025
శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం: భూమన

AP: శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. ‘అలిపిరిలో మలమూత్రాలు విసర్జించే చోట, మద్యం బాటిల్స్ మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హైందవ ధర్మానికి తూట్లు పొడిచేలా టీటీడీ తీరు ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయి. హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.
News September 16, 2025
పిల్లలకు పాలు ఎలా పట్టించాలి?

బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలి. అయితే జాగ్రత్తగా పాలు పట్టించకపోతే గొంతులోకి బదులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బిడ్డకు ప్రాణాంతకమవుతుంది. పాలిచ్చేటప్పుడు శరీరం కంటే బిడ్డ తల పైకి ఉండాలి. చేతులతో బిడ్డ భుజాలు, తల, వీపు భాగానికి ఆసరా ఇవ్వాలి. పాలివ్వడానికి తల్లి ముందుకు ఒంగకూడదు. కుర్చీలో వెనక్కి ఆనుకొని పట్టించాలి. పాలు పట్టాక జీర్ణం అయ్యేందుకు కొద్దిసేపు బిడ్డ వీపు నెమ్మదిగా నిమరాలి.