News November 18, 2025
ఎనామలీ స్కాన్ ఎందుకంటే?

ప్రెగ్నెన్సీలో 20వారాల తర్వాత ఎనామలీ స్కాన్ చేయించాలని వైద్యులు సూచిస్తారు. మీ గర్భంలో పెరుగుతున్న బేబీ అవయవాల ఆకృతిని ఈ పరీక్ష విశ్లేషిస్తుంది. క్లెఫ్ట్ లిప్(పెదాల చీలిక), స్పైనా బైఫైడా (వెన్నుముక సరైన ఆకృతికి రాకపోవడం), ఎడ్వర్డ్ సిండ్రోమ్ (అదనపు క్రోమోజోమ్స్ ఉండడం), కంజెషనల్ హార్ట్ డిసీజ్(CHD) వంటివి ఇందులో తెలుస్తాయి. అంతర్గత అవయవాల ఎదుగుదలను కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఈ టెస్ట్ తప్పనిసరి.
Similar News
News November 18, 2025
పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP: తిరుమల పరకామణి కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని సీఐడీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. కాగా సతీశ్ మృతి కేసును తాజాగా హత్య కేసుగా నమోదుచేసిన విషయం తెలిసిందే.
News November 18, 2025
జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగుకు అవసరమయ్యే ఎరువులు

జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో మంచి దిగుబడి రావాలంటే పంటకు అవసరమైన ఎరువులను వివిధ దశల్లో అందించాలి.
☛ పంట విత్తేటప్పుడు 50kg DAP+20kg MOP వేయాలి.
☛ పంట 20 రోజుల వయసులో 50kg యూరియా
☛ పంట 40 రోజుల వయసులో 50kg యూరియా
☛ పంట 60 రోజుల వయసులో 25kg యూరియా+15kg MOP ☛ ప్రతి మూడు సీజన్లకు ఒకసారి జింక్ సల్ఫేట్ 20kgలను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 18, 2025
జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో కలుపు నివారణ

పంట విత్తిన 48గంటల్లో 200L నీటిలో అట్రాజిన్ 1kg పొడి మందు కలిపి పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా ఎకరాకు 200L నీటిలో పారాక్వాట్ 1L కలిపి విత్తే ముందు లేదా విత్తాక పిచికారీ చేయాలి. 20-25 రోజులకు వెడల్పాటి కలుపు మాత్రమే ఉంటే 200L నీటిలో 400 గ్రా. 2,4-D సోడియంసాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. గడ్డి, ఆకుజాతి కలుపు ఉంటే ఎకరానికి 200L నీటిలో టెంబోట్రాయాన్ 34.4% 115ml కలిపి పిచికారీ చేయాలి.


