News March 19, 2025

ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News July 5, 2025

విద్యా కిట్లు వెంటనే అందించాలి: పద్మశ్రీ

image

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య, సరైన వసతులు, సరైన ఆహారం, అవసరమైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జిల్లా పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ పద్మశ్రీ అన్నారు. శనివారం ఏలూరులో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యా కిట్ల పంపిణీ కొన్ని మండలాల్లో ఆలస్యం అయినట్లు గుర్తించామన్నారు. కిట్స్ వెంటనే అందించాలన్నారు.

News July 5, 2025

శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్

image

టీమ్‌ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టారు. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా అవతరించారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో గిల్ ఫస్ట్ ఇన్నింగ్సులో 269, రెండో ఇన్నింగ్సులో 80 రన్స్ కలిపి 349* పరుగులు చేశారు. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ (344) రికార్డును ఆయన చెరిపేశారు. వీరిద్దరి తర్వాత లక్ష్మణ్ (340), గంగూలీ (330), సెహ్వాగ్ (319) ఉన్నారు.

News July 5, 2025

‘లోక్ అదాలత్‌లో 116 కేసులు రాజీ’

image

పార్వతీపురం మన్యం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌లో 116 కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరిగిందని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు అన్నారు. న్యాయస్థానం ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి సహకరించడం శుభ పరిణామం అన్నారు.