News April 24, 2025

ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పత్తి ధర ఈరోజు భారీగా పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,560 పలకగా.. ఈరోజు రూ.7,700 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం మంచి విషయం అయినప్పటికీ, పత్తి అందుబాటులో లేని సమయంలో ధర పలకడం పట్ల రైతులు నిరాశ చేందారు.

Similar News

News February 9, 2026

ఓట్ల లెక్కింపును పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి తమ బాధ్యతలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో ప్రతి ఓటు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపూలో అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.

News February 9, 2026

IAF అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(<>IAF<<>>) అగ్నిపథ్ స్కీం కింద అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఫిబ్రవరి 23 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జులై 2, 2005-జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in

News February 9, 2026

MBNR: కామారెడ్డిలో రైల్వే ట్రాక్‌పై మహిళ ఆత్మహత్య

image

కామారెడ్డి పట్టణంలోని రైల్వే ట్రాక్‌పై మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్సై సాదు లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ వెంగళాయపల్లెకు చెందిన మీరిగల్ల సరోజనమ్మ(75)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.