News January 21, 2025
ఎన్‌కౌంటర్‌లో చిత్తూరు జిల్లా వాసి మృతి..?

ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమానుపెంటకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన గతంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది.
Similar News
News February 6, 2026
పుంగనూరు TDP ఇన్‌ఛార్జ్ మార్పుపై కసరత్తు..?

పుంగనూరులో పెద్దిరెడ్డిని ఎదుర్కోవడంలో TDP ఇన్‌ఛార్జ్ చల్లా బాబు విఫలం అవుతున్నారని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారట. కూటమి అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం YCPదే పవరంటూ తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానం వద్ద వాపోయారట. పెద్దిరెడ్డితో చల్లా లోపాయికారి ఒప్పందాలతో క్యాడర్ నష్టపోతుందని, ఇందుకు చెక్ పెట్టాలని ఓవర్గం హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం. అధిష్ఠానం సైతం ఇన్‌ఛార్జ్‌ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.
News February 6, 2026
చిత్తూరు: హస్తం పార్టీ మళ్లీ పుంజుకునేనా.?

జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేడు అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. మళ్లీ పుంజుకునే అవకాశాలు తక్కువే. కేంద్ర మాజీ మంత్రి చింతా, స్థానిక నేతలు ప్రజల్లో అడపాదడపా తిరుగుతున్నా ఆ ప్రభావం కనిపించడం లేదు. రెండు రోజుల నుంచి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తిరుగుతున్నారు. రఘువీరారెడ్డి వంటి నేతలు నాయకులలో నూతనోత్సాహం నింపేలా ప్రయత్నిస్తున్నారు. మరి మళ్లీ హస్తం పార్టీ జెండా ఎగురుతుందా.?
News February 6, 2026
చిత్తూరు: హజ్ యాత్రికులకు రేపు వైద్య పరీక్షలు

హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు శనివారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖాజీముల్ హుజా జ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయడంతో పాటు వ్యాక్సిన్ వేస్తారన్నారు.


