News January 2, 2026

ఎన్గల్ గ్రామ శివారులో చిరుత సంచారం..?

image

చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రెండు రోజుల కింద హన్మాజీపేట శివారులోని రైస్ మిల్ వద్ద చిరుతపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించి, చిరుత సంచారం నిజమేనని నిర్ధారించారు. ఈ క్రమంలో ఎన్గల్ గ్రామ శివారులో చిరుత సంచరించడం గమనించినట్లు ప్రచారం జరగడంతో గ్రామస్థులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

Similar News

News January 3, 2026

సుదర్శన చక్రం ఆవిర్భావం, విశిష్టత

image

రాక్షసుల ఆగడాల నుంచి లోకాన్ని రక్షించడానికి శక్తిమంతమైన ఆయుధం అవసరమని భావించిన విష్ణుమూర్తి, శివుడిని ప్రార్థించారు. శివపురాణం ప్రకారం.. శివుడే అత్యంత విధ్వంసకరమైన సుదర్శన చక్రాన్ని విష్ణువు కోసం సృష్టించి బహుకరించాడు. ఒక్కసారి ప్రయోగిస్తే లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వచ్చే ఈ దివ్యాయుధం, ధర్మస్థాపనలో కీలక పాత్ర పోషించింది. సృష్టికర్త శివుడు కాగా, దానిని ధరించి లోక కల్యాణం గావించింది మహావిష్ణువు.

News January 3, 2026

లేట్ నైట్ స్నాక్స్ తింటున్నారా?

image

లేట్ నైట్ స్నాక్స్ తినడం వల్ల పలు అనారోగ్యాలొస్తాయంటున్నారు నిపుణులు. ఆలస్యంగా తినడం వల్ల నిద్ర సరిగా పట్టదు. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే షుగర్ లెవెల్స్ పెరగడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. రాత్రి భోజనంలో ప్రొటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల లేట్ నైట్ క్రేవింగ్స్‌కి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

News January 3, 2026

పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే ఉద్యమం: జాన్ వెస్లీ

image

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే ఉద్యమిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. శనివారం వనపర్తి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ. 32 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 74 వేల కోట్లు అని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే తీరుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.