News March 3, 2025

ఎన్టీఆర్: అలర్ట్.. ఆ రైళ్ల నంబర్‌లు మారాయి

image

విజయవాడ మీదుగా ప్రయాణించే 4 రైళ్లకు మార్చి 1 నుంచి నూతన నంబర్‌లు కేటాయించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖపట్నం- కడప తిరుమల(డైలీ) ఎక్స్‌ప్రెస్‌కు పాత నంబర్లు 17487/17488 స్థానంలో 18522/18521 నంబర్లు ఉంటాయన్నారు. అదే విధంగా వారంలో 5 రోజులు ప్రయాణించే విశాఖపట్నం- గుంటూరు ఉదయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పాత నంబర్లు 22701/22702 స్థానంలో 22875/22876 నంబర్లు ఉంటాయని స్పష్టం చేశారు.

Similar News

News February 17, 2026

నైట్ షాపింగ్‌కు ముస్తాబవుతున్న హైదరాబాద్

image

మరో 3రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో పాతబస్తీలో సందడి మొదలైంది. ఈ నెల 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో చార్మినార్ పరిసరాల్లో వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగే నైట్ షాపింగ్‌తో పాటు, నోట్లో కరిగిపోయే హలీం రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు భారీగా తరలిరానున్నారు. దీంతో ఓల్డ్ సిటీ సరికొత్త వెలుగులతో కళకళలాడుతోంది.

News February 17, 2026

ముగ్గురు IASలను పెళ్లి చేసుకున్న IAS ఆఫీసర్!

image

IAS ఆఫీసర్ అవీ ప్రసాద్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం, ముగ్గురు భార్యలూ IASలే కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ క్యాడర్(2014 బ్యాచ్)కి చెందిన ప్రసాద్ తొలుత IAS రిజు బఫ్నాను పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకొని 2016 బ్యాచ్ ఆఫీసర్ మిషా సింగ్‌ను వివాహమాడారు. 4ఏళ్ల తర్వాత ఆమె నుంచీ విడిపోయారు. ఈనెల 11న 2017 బ్యాచ్ ఆఫీసర్ అంకిత ధాక్రేను పెళ్లాడారు. వీరంతా ప్రస్తుతం MPలోనే పనిచేస్తున్నారు.

News February 17, 2026

HNK: జేఈఈ మెయిన్స్‌లో హర్షిత్‌కు 99.58 పర్సంటైల్

image

హనుమకొండ తహశీల్దారు గుజ్జుల రవీందర్ రెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి జేఈఈ మెయిన్స్‌లో 99.58 పర్సంటైల్ సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అత్యుత్తమ ఫలితం సాధించేందుకు ఇంకా కృషి చేస్తానన్నారు. హనుమకొండలో పాఠశాల విద్యాభ్యాసం, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలో సెకండియర్ చదువుతున్నాడు. తన కుమారుడు అత్యుత్తమ పర్సంటైల్ సాధించడం ఆనందంగా ఉందని తహశీల్దారు పేర్కొన్నారు.