News March 18, 2025
ఎన్టీఆర్: అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ (2022, 23, 24 బ్యాచ్‌లు) రెగ్యులర్, సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 28లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షల షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.
Similar News
News November 12, 2025
నరసరావుపేట: ఎలుకల నివారణ గోడపత్రికల ఆవిష్కరణ

సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములై తమ పంటలను ఎలుకల బారినుంచి కాపాడుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంపై గోడపత్రికలు ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అందించిన బ్రోమోడయోలిన్ మందును నూనెతో కలిపిన నూకలను తీసుకొని విషపు ఎరను తయారు చేసుకోవాలని చెప్పారు.
News November 12, 2025
చంచల్‌గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

HYDలోని చంచల్‌గూడ జైలులో జాబ్రి, దస్తగిరి అనే రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలవ్వగా జాబ్రీని సికింద్రాబాద్ గాంధీకి, దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చిన జాబ్రిను చూడగానే దస్తగిరి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. వీరి గొడవతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. వారిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు సమాచారం.
News November 12, 2025
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు: డీఎంహెచ్‌వో

లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో అమృతం హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చాంబర్‌లో బుధవారం వైద్యాధికారుల కమిటీ సమావేశం జరిగింది. డెకాయ్ ఆపరేషన్లు పటిష్టంగా అమలుపరిచి, స్త్రీ నిష్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని 115 స్కానింగ్ సెంటర్‌లలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.


