News July 10, 2025
ఎన్టీఆర్: ఈ నెల 12తో ముగియనున్న గడువు

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు (కాంట్రాక్ట్) అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. ఈ నెల 12లోపు అభ్యర్థులు తమ కొటేషన్‌లను విజయవాడలోని కలెక్టర్, JC కార్యాలయంలో అందజేయాలన్నారు. మూడేళ్ల అనుభవం ఉండి అకౌంటింగ్ సిస్టమ్స్, టూల్స్ ప్రొఫిషయన్సీ, ఫైలింగ్ తదితర అంశాలలో పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.
Similar News
News July 10, 2025
మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న భారీ వరద

మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఉదయం 3 లక్షల క్యూసెక్కులుగా ఉన్న నీరు సాయంత్రం వరకు 6.9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. వచ్చిన నీరును 85 గేట్లు ఓపెన్ చేసి అధికారులు గోదావరి నదికి వదులుతున్నారు. ప్రాణహిత నది నుంచి రాత్రి వరకు మరింత నీరు రానున్నట్లు తెలిపారు. బ్యారేజ్ వద్ద పోలీసులు 24 గంటలు గస్తీ కాస్తున్నారు.
News July 10, 2025
అమలాపురం: పేదరిక నిర్మూలనకు కలెక్టర్ ఆదేశం

అమలాపురంలోని కలెక్టరేట్‌లో గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పీ4’ స్కీమ్ కింద గ్రామస్థాయి నుంచి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ‘జీరో పేదరికం’ సాధనకు అధికారులు కృషి చేయాలని విజయానంద్ దిశానిర్దేశం చేశారు. ‘బంగారు కుటుంబం’ ఎంపిక ద్వారా ఇది సాధ్యమేనని అధికారులు పేర్కొన్నారు.
News July 10, 2025
BREAKING: సిరిసిల్ల: నిరుద్యోగి ఆత్మహత్య

ఉద్యోగం రావడంలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఈరోజు చోటుచేసుకుంది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్(25) ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందాడు. గురువారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. తల్లి మణెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది.