News April 10, 2024

ఎన్టీఆర్: ఈ నెల 22తో ముగియనున్న గడువు

image

ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 22లోపు సంబంధిత శాఖల నుంచి ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. స్పెషల్ ఓటర్లు, సర్వీస్ ఓటర్లు, ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ తదితర 5 కేటగిరీలకు చెందిన వారికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించిందని కలెక్టర్ చెప్పారు. 

Similar News

News December 19, 2025

DRC సమావేశాలను సీరియస్‌గా తీసుకోండి: బుద్ధప్రసాద్

image

ఎంతో ప్రాధాన్యత కలిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం (DRC) నిర్వహణను సీరియస్‌గా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను కోరారు. శుక్రవారం సాయంత్రం సుభాష్ అధ్యక్షతన DRC సమావేశం నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 4 గంటలకు ప్రారంభం కావడం పట్ల బుద్ధప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

News December 19, 2025

పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పరిశ్రమలు, తదితర అంశాల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో APIIC ద్వారా గత 2ఏళ్లలోపు మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని వారితో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

News December 19, 2025

పామాయిల్ సాగుపై రైతులను చైతన్య వంతులను చేయండి: కలెక్టర్

image

అధిక లాభాలు ఇచ్చే పామాయిల్ సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజాప్రతినిథులను కోరారు. శుక్రవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ప్రత్యేకంగా పామాయిల్ సాగు వల్ల కలిగే లాభాలను కలెక్టర్ సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిథులకు వివరించారు. ప్రతి ఒక్క రైతు పామాయిల్ సాగుపై మరలేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.