News October 10, 2025
ఎన్టీఆర్: ఉద్యోగాల కల్పనపై మంత్రి కీలక ప్రకటన

మైనారిటీ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో ఖతార్‌లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి NMD ఫరూక్ తెలిపారు. ఈ నెల 13న విజయవాడ ప్రభుత్వ ITI కళాశాలలో ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఎంపికైనవారికి నెలకు రూ.1.20 లక్షల వేతనం లభిస్తుందన్నారు. 21- 40 ఏళ్లలోపు వయస్సు ఉండి బీఎస్సీ, GNM నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.
Similar News
News October 10, 2025
నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్.. ఎవరీ మరియా..

వెనిజులాకు చెందిన మరియా కొరినా <<17966688>>మచాడోను<<>> నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే. 1967 OCT 7న జన్మించిన మరియా 2002లో రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ప్రతిపక్ష పార్టీ ‘వెంటె వెనెజులా’కు నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. 2018లో BBC 100 ఉమెన్, టైమ్ మ్యాగజైన్ వరల్డ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో నిలిచారు. దేశం దాటి వెళ్లకుండా ఆమెపై వెనిజులా ప్రభుత్వం నిషేధం విధించింది.
News October 10, 2025
MBNR: స్నాతకోత్సవం.. పాలమూరు వర్శిటీ చరిత్ర

పాలమూరు వర్శిటీ MBNRలో 2008లో ఏర్పడింది. గతంలో ఇది OU పరిధిలో భాగంగా PG సెంటరుగా ఉండేది. 2008-09 విద్యా సంవత్సరం నుంచి ఈ వర్శిటీలో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో M.A(రాజనీతి శాస్త్రం), MBA., ఎం.సీ.ఏ., ఎం.కాం., ఎమ్మెస్సీ కోర్సులు ప్రారంభించారు. ఇంజినీరింగ్, MBA, B.Pharma వంటి అనేక UG, పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులను అందిస్తుంది. ఈనెల 16న స్నాతకోత్సవం సందర్భంగా.. ‘Way2News’ ప్రత్యేక కథనం.
News October 10, 2025
SKLM: ప్రయాణికులకు శుభవార్త

పంచరామ క్షేత్రాలకు శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి CH అప్పలనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట వెళ్లేందుకు రూ 2,400, 2,350లతో apsrtconline.inలో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.