News March 20, 2025
ఎన్టీఆర్: ‘ఏడాదికి 4,800 బస్సులు ఉత్పత్తి చేస్తాం’

విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో బుధవారం ప్రారంభమైన యూనిట్‌లో ఏడాదికి 4,800 బస్సులు ఉత్పత్తి చేస్తామని అశోక్ లేల్యాండ్ సంస్థ ట్వీట్ చేసింది. తమ సంస్థ చరిత్రలో మల్లవల్లి యూనిట్ ప్రారంభించడం గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఇక్కడే తమ సంస్థ ఏర్పాటు చేసిన “నలంద”లో లెర్నింగ్ సెంటర్, అడ్వాన్స్డ్ సర్వీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలిందిస్తామని అశోక్ లేల్యాండ్ Xలో పోస్ట్ చేసింది.
Similar News
News March 21, 2025
అవి తీసుకురాకండి: వనపర్తి జిల్లా కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8:30 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలని, స్మార్ట్ వాచ్‌లు, మొబైల్ ఫోన్లు వంటివి తీసుకురావద్దని సూచించారు.
News March 21, 2025
నాగర్ కర్నూల్: ‘జైలులో ఖైదీలు ఎలా ఉన్నారు..?’

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సబ్ జైలును గురువారం జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ, జిల్లా జడ్జి సబిత సందర్శించారు. జైల్లో ఖైదీలు ఎలా ఉన్నారు.. వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఖైదీలకు వండే ఆహార పదార్థాలను, వంటగదిని పరిశీలించారు. పిల్లలకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు.
News March 21, 2025
తిరుపతిలో 248 మందికి సబ్సిడీ రుణాలు

తిరుపతి పార్లమెంట్ పరిధిలో పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలుపై కేంద్ర మంత్రిని ఎంపీ గురుమూర్తి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావ్నీత్ సింగ్ సమాధానం ఇస్తూ… తిరుపతి పార్లమెంట్ పరిధిలో 248 మంది లబ్ధిదారులకు రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.