News January 31, 2025
ఎన్టీఆర్: ఏ.కొండూరులో 20 మంది అరెస్ట్

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు (మ) చీమలపాడులో కోడిపందేల శిబిరంపై గురువారం ఎస్ఐ చల్లా కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో 20 మంది పందేం రాయుళ్లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక కోడిపుంజు, కోడి కత్తి, రూ.24,450 నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కానిస్టేబుల్స్ ప్రేమ్ కుమార్, తిరుపతిరావు, బాబురావు ఉన్నారు.
Similar News
News November 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 8, 2025
త్వరలో రూ.8 కోట్లు విడుదల: కలెక్టర్

మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి పంటకు రూ.10 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.8 కోట్లు త్వరలోనే జమ చేస్తామని కర్నూలు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలులో తేమశాతం 13-14% ఉన్నా కొనుగోలు చేయాలన్నారు.
News November 8, 2025
నేడు ములుగు జిల్లాలో కరెంట్ కట్

మరమ్మతుల్లో భాగంగా శనివారం ఉ.10 గంటల నుంచి ఉ.11:30 గంటల వరకు ములుగు జిల్లా వ్యాప్తంగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో కరెంట్ ఉండదని డీఈ నాగేశ్వరరావు తెలిపారు. ములుగు, పత్తిపల్లి, మల్లంపల్లి, రామచంద్రపూర్, కాటాపూర్, వెంకటాపూర్, వెల్తుర్లపల్లి, మల్లూరు, కమలాపూర్, రాజుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, ధర్మారం, నూగూరు, వెంకటాపురం సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.


