News December 11, 2025

ఎన్టీఆర్ కలెక్టర్‌కు సీఎం ఇచ్చిన ర్యాంక్ ఎంతంటే.!

image

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల పనితీరును అంచనా వేసే ఈ-ఫైల్ డిస్పోజల్ రిపోర్ట్ విడుదలైంది. గత మూడు నెలల కాలానికి సంబంధించి విడుదలైన ఈ నివేదికలో ఎన్టీఆర్ జిల్లా 23వ స్థానంలో నిలిచింది. కలెక్టర్ లక్ష్మీశా మొత్తం 538 ఈ-ఫైళ్లను స్వీకరించగా, 581 ఈ-ఫైళ్లను ఫార్వర్డ్‌, క్లోజ్‌, మెర్జ్‌ చేయడం జరిగింది. పరిపాలనలో డిజిటల్‌ విధానాల అమలులో జిల్లా పనితీరుపై ఈ నివేదిక స్పష్టతనిచ్చింది.

Similar News

News December 12, 2025

TPT : రెండవ రోజు 81 మంది గైర్హాజరు

image

తిరుపతి జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) గురువారం ప్రశాంతంగా జరిగినట్లు DEO KVN కుమార్ తెలిపారు. మొత్తం 12 పరీక్ష కేంద్రాల్లో 803 మంది హాజరు కావాల్సి ఉండగా 722 మంది పరీక్షలు రాశారు. రెండవ రోజు 81 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో CCTV పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు, మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచారు. రెండు రోజు ఎటువంటి ప్రతికూల సంఘటనలు జరగలేదన్నారు.

News December 12, 2025

అందరి చూపు నెల్లూరు వైపు.. ఎందుకో తెలుసా

image

నెల్లూరు జిల్లా.. ఈ పేరు అంటే నిన్న మొన్నటి వరకు లేడీ డాన్స్ హత్యలతో రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆ ఎపిసోడ్ ముగిసేలోగా నెల్లూరులో మరో హత్యాయత్నం చోటుచేసుకుంది. అప్రమత్తం అయిన పోలీసులు 24 గంటల్లో ఐదు మందిని రోడ్డుపై ఊరేగించారు. ఇప్పుడు నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మానంలో రెండు పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏది ఏమైనా అందరి చూపు నెల్లూరు వైపు మళ్లింది.

News December 12, 2025

వాసాలమర్రిలో టై.. జిల్లా కలెక్టర్ టాస్ వేయాలని నేతల పట్టు

image

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా కూడా ఇద్దరికీ సమానం రావడంతో టాస్ వేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ జిల్లా కలెక్టర్‌తో మాత్రమే టాస్ వేయాలని అధికార పార్టీకి చెందిన నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వాసాలమర్రికి కలెక్టర్ రానున్నట్లు సమాచారం.