News November 29, 2024
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో రేపు 4,70,210 మందికి పింఛన్లు

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,70,210 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,31,961 మందికి రూ.97,939,00,00, కృష్ణా జిల్లాలో 2,38,249 మందికి రూ.1,01,09,08,500 డిసెంబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News November 8, 2025
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.
News November 7, 2025
ఓటర్ల అభ్యర్థనలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

కృష్ణా జిల్లాలో బుక్ ఏ-కాల్ విత్-బి.ఎల్‌ఓకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న 82 ఓటర్ల అభ్యర్థనలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ బాలాజీ ఎన్నికల అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్ర వ్యాప్తంగా ‘బుక్ ఏ-కాల్ విత్-బీఎల్ఓ పేరిట ఓటర్ల సౌకర్యం కోసం ఈసీఐ వెబ్‌సైట్ ద్వారా నూతన విధానంలో ఒక వేదికను ఏర్పాటు చేశారన్నారు.
News November 7, 2025
త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.


