News March 12, 2025
ఎన్టీఆర్ జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు జి. జయ లక్ష్మి (IAS) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
Similar News
News November 8, 2025
గద్వాల: రేపు న్యాయవాదుల పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఉదయం 9:00 గంటలకు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయం నుంచి హైదరాబాద్ వైపు పాదయాత్ర మొదలవుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు శనివారం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయ బంధువులందరూ పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
News November 8, 2025
సూళ్లూరుపేట: ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య

సూళ్లూరుపేట మండలం ఉగ్గుమూడి గ్రామంలో శనివారం విషాదకర ఘటన జరిగింది. కుటుంబ సమస్యల కారణంగా ఓ వివాహిత వరలక్ష్మి(24) తన ఇద్దరు పిల్లలు వర్షత్ (4), ప్రశాంత్( 2)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 8, 2025
కనిగిరిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కనిగిరిలోని కూచిపూడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు.. కూచిపూడిపల్లికి చెందిన జొన్నలగడ్డ సృజన్ (52) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


