News March 14, 2026

ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో నెం.1గా నిలపాలి: కలెక్టర్

image

రహదారి ప్రమాదాలను తగ్గించి, ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బ్లాక్ స్పాట్ల వద్ద పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 15, 2026

నాతవరం జీడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

నాతవరం మండలం గన్నవరం గ్రామ పరిసర జీడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి (40) మృతిచెందాడు. సమాచారం అందుకున్న SI వై.తారకేశ్వరరావు మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు 4-5 రోజుల క్రితమే మరణించినట్లు అంచనా వేస్తున్నారు. మృతుడు నలుపు షార్ట్, చెక్స్ షర్ట్, క్రాక్స్ చెప్పులు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని SI కోరారు.

News April 15, 2026

హార్ముజ్ బ్లాక్.. ఇరాన్‌కు ఎంత నష్టమంటే?

image

పశ్చిమాసియాకు అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని <<19639152>>యుద్ధ నౌకలతో<<>> అమెరికా బ్లాక్ చేయడం తెలిసిందే. ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై ఆంక్షలు పెట్టింది. దీంతో ఇరాన్‌కు రోజూ 435 మిలియన్ డాలర్ల(రూ.4 వేల కోట్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. దిగ్బంధనం లేని ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన 154 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని Kpler తెలిపింది. ఆ క్రూడ్‌ను ఎగుమతి చేసేందుకు ఛాన్స్ ఉంది.

News April 15, 2026

తిరుచానూరులో మిథాలి రాజ్ పూజలు

image

మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేశ్, ఏవిఎస్వో రాధాకృష్ణ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మిథాలి రాజ్‌కు అర్చకులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయాధికారులు ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.