News October 12, 2024

ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు

image

ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 113 మద్యం షాపుల కోసం 5,787 అప్లికేషన్లు వచ్చాయి. జిల్లాలోని ప్రతి షాపునకు సగటున 51 దరఖాస్తులు దాఖలైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ నెల 12,13వ తేదీల్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం 14వ తేదీన జిల్లా అధికారుల సమక్షంలో డ్రా తీసి మద్యం షాపులను కేటాయించనున్నట్లు అధికారులు చెప్పారు.

Similar News

News November 24, 2024

కృష్ణా: రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అందజేసిన అధికారులు

image

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి గతంలో రిటర్నబుల్ ప్లాట్లు అందుకోని వారికై CRDA అధికారులు శనివారం విజయవాడలోని తమ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో ప్లాట్లు అందజేశారు. మొత్తం 37 మంది రైతులకు 120 నివాస, 49 వాణిజ్య ప్లాట్ల ప్రొవిజినల్ సర్టిఫికెట్లను ఇచ్చామని CRDA అదనపు కమిషనర్ ఎం. నవీన్ చెప్పారు. రైతులు సంబంధిత రిజిస్ట్రేషన్ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. 

News November 23, 2024

మండవల్లి:  తల్లి-కుమారుడు దారుణ హత్య

image

మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో అర్ధరాత్రి తల్లి-కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు రొయ్యూరు భ్రమరాంబ (60), సురేశ్ (21)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఒంటరిగా నివసిస్తున్న ఇంటిలో వీరు హత్యకు గురి కావడం గ్రామంలో సంచలనంగా మారింది. ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మండవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 23, 2024

పెనమలూరు: ‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు’

image

పెనమలూరులోని పోరంకి కుమ్మరి బజార్‌కు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా వేరుగా పాపతో కుట్టుమిషన్‌తో జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఓ మహిళ బట్టలు కుట్టించుకొని భర్త సుందర్ సెల్ నుంచి డబ్బులు పంపేది. సుందర్ మహిళకు ఫోన్ చేసి మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకునేవాడు. గతంలో అబార్షన్ కూడా చేయించాడు. అంతే కాకుండా తన డబ్బులు, బంగారం తీసుకుని మోసం చేశాడని పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది.