News July 4, 2024

ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక స్టాక్ వివరాలు

image

జిల్లాలో 08 స్టాక్ పాయింట్ల‌లో 3.69లక్షల క్యూబిక్ మీట‌ర్ల మేర ఇసుక‌ అందుబాటులో ఉందని NTR జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. * పెండ్యాల (కంచిక‌చ‌ర్ల): 19,781* మాగ‌ల్లు (నందిగామ): 36,366* కొడ‌వ‌టిక‌ల్లు (చంద‌ర్ల‌పాడు): 9,713* అల్లూరుపాడు (వ‌త్స‌వాయి): 3,040* అనుమంచిప‌ల్లి (జ‌గ్గ‌య్య‌పేట): 56,820* పోలంప‌ల్లి (వ‌త్స‌వాయి): 922* కీస‌ర (కంచిక‌చ‌ర్ల): 1,49,703* మొగులూరు (కంచిక‌చ‌ర్ల): 93,243

Similar News

News July 8, 2024

కృష్ణా: కైకలూరులో మాజీ ఎమ్మెల్యేపై ఫ్లెక్సీల కలకలం

image

కైకలూరు మాజీ MLA దూలం నాగేశ్వరరావు 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు అంటూ.. మంగళవారం పలుచోట్ల ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నాగేశ్వరావు ఐదేళ్ల పాలనలో అనేక అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు చేశారంటూ పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ప్లెక్సీ ఏర్పటు చేశారు. ఎమ్మెల్యే బాధితుల సంఘం అధ్యక్షుడు అంటూ వరప్రసాద్(బాబి) పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

News July 8, 2024

విజయవాడ: ఆర్‌ఐని సస్పెండ్ చేసిన సీపీ

image

పోలీసు సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్న ఆర్‌ఐ శ్రీనివాసరావును విజయవాడ కమిషనర్ రామకృష్ణ ఆదివారం సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు తన క్రింది మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు.

News July 8, 2024

జగ్గయ్యపేట: సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం.. ఐదుగురిని కాపాడిన యువకుడు

image

జగ్గయ్యపేటలోని ఓ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన హేమంత్ కుమార్ ఐదుగురి ప్రాణాలు కాపాడారు. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం సమయంలో 4వ అంతస్తులో పనిచేస్తున్నాని, కంగారులో పై అంతస్తులోని వారు కిందకు దిగుతుంటే వేడి తగ్గేవరకు ఇక్కడే ఉండాలని వారిని నిలువరించానన్నారు. కంగారులో కొందరు కిందకు వెళ్లడంతో వేడి సిమెంట్ ధూళి పడి గాయపడ్డారని చెప్పాడు.