News April 1, 2026

ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి రేషన్‌

image

ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి రేషన్‌ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సరుకుల అందజేతకు అన్ని చర్యలు తీసుకున్నారు. బుధవారం నుంచి రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసరాలు ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయంలో కార్డుదారులకు బియ్యం, చక్కెర గోధుమపిండిని అందజేస్తారు.

Similar News

News April 16, 2026

నిర్మల్: పాలీసెట్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

మే 13వ తేదీన నిర్వహించనున్న పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన, ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిప్లమో కోర్సుకు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 16, 2026

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

News April 16, 2026

‘వ్యవసాయ భూములను నివాస ప్రాంతాల నుంచి తొలగించాలి’

image

వ్యవసాయ భూములను నివాస ప్రాంతాల నుంచి తొలగించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి అనామిలి కమిటీ సమావేశం గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించారు. నివాస ప్రాంతాల ధరల మాదిరిగానే వ్యవసాయ భూములకు ధరలను నిర్ణయించడంపై వచ్చిన అర్జీలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు మేలు చేయడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మార్కెట్ వాల్యూ జిల్లా రిజిస్టర్ కమిటీ కన్వీనర్ ప్రసాద్ పాల్గొన్నారు.