News August 28, 2025

ఎన్టీఆర్ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పెనుగంచిప్రోలు, చందర్లపాడు, ఏ. కొండూరు, విసన్నపేట, గంపలగూడెం, రెడ్డిగూడెం, తిరువూరు, మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరంగా విద్యా సంస్థలకు సెలవులు మంజూరు చేసినట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు.

Similar News

News August 28, 2025

అధికార ప్రకటన.. రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా చమర్తి

image

రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా చమర్తి జగన్మోహన్ రాజును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి కడప జిల్లా కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఇన్‌ఛార్జ్‌గా చమర్తిని స్వయంగా ప్రకటించినప్పటికీ, ఉత్తర్వులు మాత్రం గురువారం అందాయి.

News August 28, 2025

ములుగు జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ములగు జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. వాగులు, వంకలు, కాజ్‌వేలు దాటొద్దని హెచ్చరించారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న రోడ్లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 18004257109కి కాల్ చేయవచ్చని తెలిపారు.

News August 28, 2025

భీకర దాడులు.. ఉక్రెయిన్‌లో 14 మంది మృతి

image

రష్యా, ఉక్రెయిన్ పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా చేపట్టిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో ఐదుగురు పిల్లలు సహా 14 మంది మరణించారు. మరో 38 మంది గాయపడ్డారు. ఈ దాడిని ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశమే లేదని, చర్చలకు బదులు మిస్సైళ్లను ఎంచుకుందని ఆక్షేపించారు. అటు 102 ఉక్రెయిన్ డ్రోన్స్‌ను కూల్చేశామని రష్యా ప్రకటించింది.