News May 11, 2024
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాద.. మృతుడి వివరాలివే!

గోపాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద <<13228485>>మృతిని వివరాలను<<>> పోలీసులు వెళ్లడించారు. ఏ కొండూరు మండలం అట్లపడ గ్రామానికి చెందిన నల్లగట్ల అఖిల్ (24)గా గుర్తించారు. అఖిల్ తిరువూరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఏ కొండూరు ఎస్సై చల్లా కృష్ణ తన సిబ్బందితో వెళ్లి వివరాలను సేకరించి, కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News April 22, 2025
కృష్ణా : ‘కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం తగదు’

కోర్టు కేసులకు సంబంధించి వకాలత్, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.
News April 21, 2025
కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.
News April 21, 2025
కృష్ణా: 131 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేత

జిల్లాలో 131 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు సైకిళ్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందించారు. మెడికల్ క్యాంప్‌ల ద్వారా గుర్తించిన వీరికి రూ.15లక్షలు విలువ చేసే ట్రై సైకిల్స్, ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరితోపాటు పాఠశాలల్లో సమానంగా చదువుకోవడానికి ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.