News January 30, 2025
ఎన్టీఆర్ జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించిన ఆలపాటి

కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల అభ్యర్థి(టీడీపీ కూటమి) ఆలపాటి రాజేంద్ర గురువారం ఎన్టీఆర్ జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన విజయవాడ పరిసరాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. రానున్న MLC ఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని ఆలపాటి ఆయా విద్యాసంస్థల సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 13, 2025
జగన్‌తో మాజీ మంత్రి అనిల్ భేటీ

తాడేపల్లిలో YCP అధినేత జగన్‌ను ఆయన నివాసంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. నాయకులు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మరింతగా ముందుకు వెళ్లాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.
News November 13, 2025
కొల్లాపూర్: నల్లమల అడవుల రక్షణకు చెక్‌పోస్ట్

నల్లమల అడవులు ఆక్రమణకు గురికాకుండా కట్టడి చేసేందుకు ఒట్టిమాకులకుంట దారిలో అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా అడవులకు కబ్జాదారులు వెళ్లే మార్గాన్ని మూసివేసినట్లు అచ్చంపేట డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2011–2014 మధ్య కాలంలో నల్లమల అడవులను నరికివేసి అక్రమ సాగు చేసినట్లు గుర్తించామన్నారు.
News November 13, 2025
వరంగల్: ఛార్జ్ తీసుకోకుండానే వెనక్కి వెళ్లిన డీసీపీ..!

WGLలో రాజకీయ నాయకుల అనుమతి లేనిదే పోస్టింగ్‌లో చేరడం అసాధ్యం. అలాంటిది ఏకంగా WGL సెంట్రల్ జోన్ DCPగా బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన IPS అధికారికి చేదు అనుభవం ఎదురైంది. తనకు తెలియకుండా ఎలా బదిలీ చేశారంటూ ఓ నేత భర్త ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెంట్రల్ జోన్ DCP బాధ్యతలు తీసుకోవడానికి వచ్చిన సదరు అధికారి హరిత హోటల్ నుంచి నేరుగా HYDకి తిరిగి వెళ్లినట్లు సమాచారం. అధికారులకు విషయం తెలియడంతో షాక్‌లో ఉన్నారు.


