News March 17, 2025

ఎన్టీఆర్ జిల్లాలో 268 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ప్ర‌శాంతంగా సాగాయి. రిజిస్ట‌ర్ అయిన 27,711 మంది రెగ్యుల‌ర్ విద్యార్థుల‌కు గాను 27,443 మంది హాజ‌ర‌య్యారు. 44 మంది ప్రైవేటు విద్యార్థుల‌కు 39 మంది హాజ‌రైన‌ట్లు డీఈఓ యూవీ సుబ్బారావు తెలిపారు. తాను 11 ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేశామన్నారు. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు ఆస్కారం లేకుండా అధికారులకు సూచ‌న‌లు చేసినట్లు పేర్కొన్నారు. 

Similar News

News January 9, 2026

9వేల ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్!

image

తెలంగాణలోని 9,937 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సరఫరా వ్యవస్థలను సర్కార్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹290Cr వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర ఇంధన&పునరుత్పాదక ఇంధన విభాగాలు వచ్చే నెల నాటికి టెండర్లను ఖరారు చేయనున్నాయి. స్కూళ్లలో సౌర విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీకి అప్పగించారు.

News January 9, 2026

‘పరాశక్తి’ విడుదలకు లైన్ క్లియర్.. U/A సర్టిఫికెట్

image

శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సెన్సార్ బోర్డు ఇవాళ్టి వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే ఆయా సన్నివేశాలను మేకర్స్ తొలగించడంతో తాజాగా సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో పరాశక్తి యథావిధిగా రేపు రిలీజ్ కానుంది.

News January 9, 2026

గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష: ఎస్పీ శబరీశ్

image

జిల్లాలో గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష తప్పదని మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. గంజాయి సాగును అడ్డుకునేందుకు డ్రోన్ వ్యవస్థను వాడుతున్నామన్నారు. నరసింహులపేట మండలంలో వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే వారి సమాచారం పోలీసులకు అందజేయాలని ప్రజలను కోరారు.