News January 20, 2026
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు అవార్డు

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ 2025 సంవత్సరానికి ‘Overall Election Management’ విభాగంలో ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారం లభించింది. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను సమర్థంగా నిర్వహించినందుకు ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.
Similar News
News April 5, 2026
సింగిపురం: 113కి చేరిన కల్తీ బాదంపాల బాధితుల సంఖ్య

శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం జాతరలో కల్తీ బాధంపాలు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో శుక్రవారం సుమారు 80 మంది పీహెచ్సీలో చేరగా.. శనివారంనాటికి కేసులు 113కు పెరిగాయి. ప్రస్తుతం బాధితులకు స్థానిక పీహెచ్సీలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
News April 5, 2026
KMR: జిల్లాలో చికెన్, మటన్ ధరలు

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ.280-రూ.290 విక్రయిస్తుండగా లైవ్ కోడి రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. మటన్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
News April 5, 2026
IPL: ఇప్పటి వరకు వీళ్లే టాప్!

IPL-19లో ఇప్పటి వరకు 9మ్యాచులు జరగ్గా పలువురు యంగ్ క్రికెటర్లు సత్తా చాటారు. DC ప్లేయర్ సమీర్ రిజ్వీ ఆడిన 2 మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో 160పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత లిస్టులో రోహిత్(113), కూపర్(108), రఘువంశీ(103) ఉన్నారు. ఇక రవి బిష్ణోయ్(RR) 5 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నారు. వైశాఖ్ విజయ్ కుమార్ సైతం 5 వికెట్లు పడగొట్టినా ఎకానమీ పరంగా 2వ స్థానంలో ఉన్నారు.


