News March 10, 2025
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదివారం కీలక ప్రకటన చేశారు. నగరంలో ముఖ్యమైన కూడలిల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిగ్నల్ పడినప్పుడు వైట్ లైన్ వద్ద ఆగాలని లేనిచో కమాండ్ కంట్రోల్ ద్వారా ఇంటికి ఈ చలానా నోటీసులు వస్తాయని సూచించారు. అలాగే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి కూడా జరిమానాలు విధిస్తామని సూచించారు.
Similar News
News April 2, 2026
సాగర్ రికార్డు ‘పవర్’: రాష్ట్రంలోనే నంబర్ 1

జలవిద్యుత్ ఉత్పత్తిలో సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నయా రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసిన కేంద్రంగా నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఏకంగా 2,572.04 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి సాగర్ తన సత్తా చాటిందని జెన్‌కో CE మంగేష్ కుమార్ వెల్లడించారు. 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉత్పత్తి జరగడం విశేషం.
News April 2, 2026
30రోజుల్లో 10 T20లు.. టీమ్ఇండియాకు బిజీ షెడ్యూల్

IPL తర్వాత టీమ్ఇండియా టీ20ల షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. జూన్ 26 నుంచి జులై 26వ తేదీ మధ్య నెల రోజుల వ్యవధిలో ఏకంగా 10 టీ20 మ్యాచులు ఆడనుంది. జూన్ 26, 28వ తేదీల్లో ఐర్లాండ్‌తో 2 టీ20ల్లో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత జులై 1, 4, 7, 9, 11వ తేదీల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. మళ్లీ జులై 23, 25, 26వ తేదీల్లో జింబాబ్వేతో ఆడనుంది. ఇక IPLలో రాణించే యువ క్రికెటర్లు ఈ సిరీసులకు సెలెక్ట్ అయ్యే అవకాశముంది.
News April 2, 2026
ఏలూరు: విద్యార్థి చేతులు విరగ్గొట్టిన SI, ఇద్దరు కానిస్టేబుళ్లు..!

బుట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు ఓ విద్యార్థి చేతులు విరగగొట్టిన <<19530403>>సంగతి తెలిసిందే<<>>. ఈమేరకు ఎస్ఐను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వీఆర్‌లో పెట్టారు. అయితే ఈ విషయంలో స్టేషన్ రైటర్, మరో కానిస్టేబుల్‌ను కూడా వీఆర్‌కు పంపించినట్లు సమాచారం. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీస్ బాస్ అతిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతాలు పంపుతున్నారు.


