News March 16, 2025
ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు అలెర్ట్

జిల్లాలో నేడు 9 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాలులకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయవాడ అర్బన్ & రూరల్ 40.7, వీరులపాడు 41.2, పెనుగంచిప్రోలు 41.3, నందిగామ 41.4, జి.కొండూరు 40.7, చందర్లపాడు 41.4, ఇబ్రహీంపట్నం 41, కంచికచర్ల 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందన్నారు.
Similar News
News July 5, 2025
విశాఖ: 100% సబ్సిడీతో ట్రాన్స్‌పాండర్లు

విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన బోట్లకు ట్రాన్స్పాండర్లను ప్రభుత్వం అందజేసింది. 634 బోట్లకు 100% సబ్సిడీతో వీటిని సమకూర్చారు. వీటి ద్వారా సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను పర్యవేక్షించవచ్చు. సముద్రంలో బోట్లు ఉన్న స్థానాన్ని తెలుసుకోవచ్చు. వర్షాకాలం కావడంతో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటి ఉపయోగం ఎంతో ఉందని బోట్ల యజమానులు తెలిపారు.
News July 5, 2025
డొంకేశ్వర్ మండలం నుంచి 41 మంది IIITకి ఎంపిక

డొంకేశ్వర్ మండలం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఇందులో డొంకేశ్వర్ ZPHSకు చెందిన 26 మంది విద్యార్థులు ఉండటం విశేషం. 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. తొండాకూర్ ZPHS నుంచి 9, నికాల్పూర్ ZPHS ఐదుగురు, గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. డొంకేశ్వర్ పాఠశాల హెచ్ఎం సురేశ్, తొండాకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
News July 5, 2025
‘తమ్ముడు’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

నితిన్ హీరోగా దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘తమ్ముడు’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రూ.2 కోట్ల కలెక్షన్లు వచ్చాయని వెల్లడించాయి. ఈ చిత్రానికి మొదటి రోజు 27 వేలలోపే టికెట్స్ అమ్ముడుపోయాయని పేర్కొన్నాయి. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఉదయం షోలతో పోల్చితే సాయంత్రానికి ఆక్యుపెన్సీ తగ్గినట్లు తెలిపాయి.