News March 28, 2025
ఎన్టీఆర్ జిల్లా ప్రజలు జాగ్రత్త

జిల్లాలో నేడు పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. వడగాలులకు గురవ్వకుండా ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ మేరకు తమ X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. చందర్లపాడు 43.3, గంపలగూడెం 42.3, మైలవరం 43.1, నందిగామ 43.4, రెడ్డిగూడెం 42.2, వీరులపాడు 43.7, విస్సన్నపేట 41.6, విజయవాడ అర్బన్ & రూరల్ 42.5
Similar News
News September 16, 2025
ప్రజావాణి పరిష్కార వివరాలను ఆన్‌లైన్లో పెట్టండి: రాధిక గుప్తా

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 113 అర్జీలు అందాయన్నారు. గతవారం అర్జీల పరిష్కార వివరాలను ఆన్‌లైన్లో ఉంచాలని ఆదేశించారు. ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
News September 16, 2025
ప్రజాపాలన దినోత్సవ ముఖ్య అతిథి ఉత్తమ్

ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరగనుంది. సూర్యాపేట కలెక్టరేట్‌లో జరిగే వేడుకలకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.
News September 16, 2025
ఇచ్ఛాపురం: అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒడియా అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 22న ఉదయం 10 గం.లకు ఇంటర్వ్యూ ఉంటుందని, MA (ఒడియా)లో 50% మార్కులు, NET, Ph.D అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.