News March 19, 2025
ఎన్టీఆర్ జిల్లా TODAY TOP NEWS

*విజయవాడ: స్నానానికి వెళ్లి బాలుడు మృతి. * పెనుగంచిప్రోలు: పోలీసులపై దాడి కేసు నమోదు. * బ్యాడ్మింటన్ ఆట సరిగ్గా ఆడలేదని కోచ్ దాడి. * పెనుగంచిప్రోలు: ఎగ్జిబిషన్లో ప్రమాదం.. వ్యక్తి మృతి. *విజయవాడ: మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నేత బుద్ధ ఫైర్. *విజయవాడలో సందడి చేసిన కోర్ట్ సినిమా యూనిట్. * విజయవాడ: దోమల నివారణకు చర్యలు.
Similar News
News November 4, 2025
ధాన్యం సేకరణ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్

మండల ప్రత్యేక అధికారులు తమ ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ (KGBV) వంటి విద్యాసంస్థలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సమీక్షలో అధికారులకు సూచించారు.
News November 4, 2025
చిన్నారి వైష్ణవి హత్యకేసులో హైకోర్టు కీలక తీర్పు

AP: 2010 జనవరి 30న VJAలో అపహరణ, హత్యకు గురైన చిన్నారి వైష్ణవి కేసులో శిక్ష రద్దు చేయాలన్న నిందితుల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌కు ట్రైల్ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించి, శిక్ష రద్దు చేసింది. వైష్ణవిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. తర్వాత GNT శారదా ఇండస్ట్రీస్‌లోని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు.
News November 4, 2025
కొండ చుట్టూ గ్రామాలకు వెలుగునిచ్చే గండ దీపం!

భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి శివారు బుగులోని వెంకన్న స్వామి జాతరలో గండ దీపం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు వెలుగుతూ ఉంటుంది. మంగళవారం ఈ గండ దీపాన్ని వెలిగించి, 5 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.ఈ దీపం వెలుగు కొండ చుట్టూ ఉన్న గ్రామాలకు కాంతితో విరజిల్లుతుంది. భక్తులు వెంకన్న స్వామిని స్మరిస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇక్కడికి చేరుకుంటారు. ఈ దీపంలో నూనె పోసి కోరికలు కోరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


