News July 7, 2025
ఎన్టీఆర్: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీ.ఏ, బీ.కామ్, బీ.బీ.ఏ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 30-ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుపుతామని, పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని కోరింది.
Similar News
News July 7, 2025
ప్రతి విద్యార్థికి ఒక మొక్క అందజేత: కలెక్టర్

‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసి, వారి తల్లి పేరున పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ఇందుకోసం ‘లీప్ యాప్’ను రూపొందించి, అందులో విద్యార్థులు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News July 7, 2025
చిత్తూరు: అంటీముట్టనట్లుగానే వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు?

ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన మాజీలు ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. YCP అధికారంలో ఉన్నన్ని రోజులు చుట్టపు MLAలుగా ఉన్న ఆ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదేతరహాలో వ్యవహరిస్తున్నారట. పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, కుప్పం ఇన్‌ఛార్జ్‌లు రాష్ట్రస్థాయిలో మినహా నియోజకవర్గ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.
News July 7, 2025
నెల్లూరు: ఆరోగ్యం రొట్టె పట్టుకున్న మంత్రి నారా లోకేశ్

నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా జరుగుతోంది. రెండో రోజు సోమవారం లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వీఐపీల తాకిడి కూడా ఎక్కువైంది. మంత్రి నారా లోకేశ్ రొట్టెల పండుగలో పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో ఆరోగ్యం రొట్టెను పట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మంత్రులు నారాయణ, ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రార్థనలు పాల్గొన్నారు.