News September 21, 2025

ఎన్టీఆర్: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ (హానర్స్) విద్యార్థులు రాయాల్సిన 3,5,7వ రెగ్యులర్ & సప్లిమెంటరీ సెమిస్టర్ థియరీ పరీక్షలను నవంబర్ 17 నుంచి నిర్వహిస్తామని KRU అధ్యాపక వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24 నుంచి OCT 10వ తేదీ లోపు ఎలాంటి ఫైన్ లేకుండా, 21లోపు రూ.200 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చని, వివరాలకు https://kru.ac.in/ చూడాలని KRU అధ్యాపకులు సూచించారు.

Similar News

News September 21, 2025

అనకాపల్లి జిల్లాలో 291 కేసులు పరిష్కారం

image

అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 291 కేసులు పరిష్కరించినట్లు పీజీఆర్ఎస్ నోడల్ అధికారిణి సుబ్బలక్ష్మి తెలిపారు. అనకాపల్లి ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. శనివారం జిల్లాలో 68 కేసులను విచారించి 7 కేసులు పరిష్కరించామన్నారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఈ సమావేశాలు జరిగాయన్నారు.

News September 21, 2025

కోలలపూడి వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

image

మార్టూరు (M) కోలలపూడి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. తిరుపతి నుంచి పిఠాపురంలోని దేవాలయానికి పిత్రుదేవతలకు పిండప్రధానం చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65) , హేమంత్ (25) గా సమాచారం. మరో ఇద్దరు గాయపడ్డారు.

News September 21, 2025

తుని: క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి

image

తుని రైల్వే ఫ్లైఓవర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై నడుచుకుంటూ వెళ్తున్న పాయకరావుపేట వాసి ప్రసాద్ (28)ను వేగంగా వచ్చిన క్రేన్ ఢీకొంది. ఈ ఘటనలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పాయకరావుపేటలో సువార్తకుడుగా జీవనం సాగిస్తున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.