News April 4, 2024

ఎన్టీఆర్: తొలిసారి పోటీకి దూరంగా దేవినేని

image

సోదరుడు రమణ మరణానంతరం 1999 నుంచి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దేవినేని ఉమ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 1999, 2004లో నందిగామలో గెలిచిన ఉమ ఆ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2009,14,19లో మైలవరంలో పోటీ చేశారు. 2019లో మినహా ఆయన ప్రతిసారి గెలుపు సొంతం చేసుకున్నారు. తాజా ఎన్నికలలో టీడీపీ అధిష్ఠానం మైలవరం టికెట్ వసంతకు కేటాయించడంతో ఉమ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.

Similar News

News December 24, 2024

పేర్ని నానికి సహకరిస్తే కఠిన చర్యలు: మంత్రి వార్నింగ్

image

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి కొంత మంది పోలీసులు సహకరిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందన్నారు. అధికారులు పేర్ని నానికి సహకరిస్తున్నారని తేలితే వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దోషులను చట్టం ముందు నిలబెడతామన్నారు. అవసరమైతే ఈ కేసును సిట్ కు అప్పగిస్తామన్నారు.

News December 24, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలోని కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ 1వ సెమిస్టర్(2024- 25 విద్యాసంవత్సరం) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను 2025 JAN 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ సిబ్బంది తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు JAN 8లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.

News December 24, 2024

27న విజయవాడలో రాష్ట్ర వాలీబాల్ జట్ల ఎంపిక

image

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గిరీషా ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర పురుషుల మహిళల వాలీబాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్ తెలిపారు. జిల్లాలో ఆసక్తిగల క్రీడాకారులు 27వ తేదీన ఉదయం ఇందిరా గాంధీ స్టేడియంలో గల వాలీబాల్ క్రీడా మైదానం ఆధార్ కార్డ్, నేటివిటీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు.