News July 5, 2025
ఎన్టీఆర్: నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు ఏఎన్‌ఎంలు ప్రమోషన్ల కోసం నకిలీ క్లినికల్ టెస్టింగ్ సర్టిఫికెట్లు సమర్పించారు. నరసరావుపేటలోని ఓ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేయకుండానే వీటిని పొందినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా డీఎంహెచ్‌ఓ శర్మిష్ఠ ఏఎన్‌ఎంలకు నోటీసులు జారీ చేశారు. సదరు కాలేజీని సంప్రదించగా, ఈ సర్టిఫికెట్లు నకిలీవని తేలిందన్నారు.
Similar News
News July 5, 2025
పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: CM

TG: పిల్లలు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ అన్నారు. HYDలో పోక్సో చట్టంపై జరిగిన స్టేట్ లెవెల్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. SMను దుర్వినియోగం చేస్తూ పిల్లలు, మహిళలపై దుర్మార్గంగా వ్యవహరించే వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. భాగస్వాములందరితో కలిసి ఈ దిశగా పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
News July 5, 2025
HYDలో ఎలక్ట్రిక్ ఆటోలు.. రయ్ రయ్

గ్రేటర్ HYD నగరంలో సుమారుగా 1.20లక్షలకుపైగా ఆటోలు ఉన్నాయని రవాణా శాఖ తెలిపింది. అయితే కాలుష్యం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోలు, CNG, LPG, రెట్రో ఫిట్మెంట్ విభాగాల్లో దాదాపు 65వేలకుపైగా ఆటోలకు అనుమతులు అందజేసింది. సుమారు 20,000 వరకు ఎలక్ట్రిక్ ఆటోలు ఇందులో ఉన్నాయి.
News July 5, 2025
HYD: త్వరలో వాట్సప్ ద్వారా ప్రాపర్టీ టాక్స్ పేమెంట్

HYD త్వరలో వాట్సప్ ద్వారా GHMC ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ తదితర రెవెన్యూ బిల్లులు సైతం చెల్లించే అవకాశం ఉంది. వాట్సాప్ బిజినెస్ ప్లాట్ ఫాం సేవల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కోసం జీహెచ్ఎంసీ ఆహ్వానించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ సహా వివిధ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది.