News December 24, 2025
ఎన్టీఆర్ నుంచి బన్నీ వద్దకు త్రివిక్రమ్ ప్రాజెక్ట్?

త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ మళ్లీ అల్లు అర్జున్ వద్దకు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కుమారస్వామి కథ ఆధారంగా తెరకెక్కే ఈ మూవీలో బన్నీ హీరోగా నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. తర్వాత ఇది NTR వద్దకు చేరింది. కానీ తాజాగా మేకర్స్ ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ₹1000Crతో తీయబోయే ఈ మూవీ షూటింగ్ 2027 MARలో ప్రారంభమవుతుందని, త్వరలో అఫీషియల్ ప్రకటన వస్తుందని సమాచారం.
Similar News
News December 25, 2025
రేవంత్ పేరెత్తని కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?

TG: KCR ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూ సుదీర్ఘంగా మాట్లాడారు. తన ప్రసంగంలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ పేరు ఎత్తలేదు. అలాంటిది అసెంబ్లీలో CM ఎదుట ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి ఇష్టపడతారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు KCR అసెంబ్లీకి వెళ్లి పాలమూరు-రంగారెడ్డిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారనే టాక్ BRS పార్టీలో విన్పిస్తోంది. దీనిపై క్లారిటీ కోసం <<18664624>>29వ తేదీ<<>> వరకు వేచి చూడాల్సిందే.
News December 25, 2025
NCERT 173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 25, 2025
తిరుమల క్షేత్రపాలుడిగా పరమశివుడు

తిరుమల కేవలం వైష్ణవ క్షేత్రమే కాదు. శైవ సామరస్యానికి వేదిక కూడా! శ్రీవారు ఇక్కడ కొలువై ఉంటే, ఆయనకు రక్షకుడిగా, క్షేత్రపాలుడిగా పరమశివుడు ‘రుద్రుడి’ రూపంలో కొలువై ఉంటారు. తిరుమల కొండపై ఉన్న ‘గోగర్భ తీర్థం’ వద్ద శివుడు క్షేత్రపాలకత్వ బాధ్యతలు నిర్వహిస్తారట. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు క్షేత్రపాలుడిని కూడా స్మరించుకోవడం ఆచారంగా వస్తోంది. హరిహరుల మధ్య భేదం లేదని ఈ క్షేత్రం చాటిచెబుతోంది.


