News March 13, 2025
ఎన్టీఆర్: నేటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాలలో డైరెక్టర్లు, మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో గురువారంలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 14, 2025
పల్నాడు: జిల్లాలోని మున్సిపాలిటీలకు నిధుల విడుదల

అక్రమ నిర్మాణాలు లేఅవుట్లు, క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలో జరిమానాల రూపంలో వసూలు చేసిన నగదు ఎట్టకేలకు ప్రభుత్వం మున్సిపల్ ఖాతాలకు జమ చేసింది. జిల్లాలోని మున్సిపల్ ఖాతాల రూ.1565 కోట్లు జమయ్యాయి. నరసరావుపేట మున్సిపాలిటీకి రూ. 2.65 కోట్లు, చిలకలూరిపేట రూ. 4, మాచర్లరూ. 3, పిడుగురాళ్ల రూ. 3, వినుకొండ రూ. 3కోట్లు విడుదలయ్యాయి. ఆయా మున్సిపాలిటీలో సిమెంట్ రోడ్లు, మురుగు కాలవల నిర్మాణాలు జరగనున్నాయి.
News November 14, 2025
ఛైర్మన్ హోదాలో నేనే పర్యవేక్షిస్తా: సీఎం చంద్రబాబు

9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే మోడల్ అని అన్నారు. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్‌ను నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో కలిసి విడుదల చేశారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా, భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామన్నారు.
News November 14, 2025
చిల్డ్రన్స్ డే నవంబర్ 20న జరుపుకునేవారు తెలుసా?

పిల్లలపై మాజీ ప్రధాని నెహ్రూ చూపిన ప్రేమ, వారి విద్య కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహిస్తారు. గతంలో UNO ప్రకటించిన నవంబర్ 20న దీనిని సెలబ్రేట్ చేసుకునేవారు. 1964లో నెహ్రూ మరణానంతరం ఆయనకు నివాళిగా మన దేశంలో నవంబర్ 14కి మార్చారు. పిల్లల హక్కులు, విద్య, అభివృద్ధి, సమానత్వం, రక్షణపై అవగాహన పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం.


