News March 12, 2025

ఎన్టీఆర్: నేడు ఈ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

image

ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం కింది మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.చందర్లపాడు 40.2, జి.కొండూరు 39.9, ఇబ్రహీంపట్నం 41, కంచికచర్ల 40.2, విజయవాడ రూరల్ 40.3, విజయవాడ అర్బన్ 40.2. 

Similar News

News September 18, 2025

ఏలూరు: రోడ్డు పక్కన గాయాలతో బాలుడు.. ఆచూకీ లభ్యం

image

ఏలూరులోని వట్లూరు వద్ద బుధవారం రాత్రి రోడ్డు పక్క పొలాల్లో గాయాలతో పడి ఉన్న బాలుడి ఆచూకీ లభించింది. విజయవాడ రామవరప్పాడు గణేశ్ నగర్‌కు చెందిన విజయ్ కుమార్ (14) గా గుర్తించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను తిరిగి వెళ్లలేదు. దీంతో అతని తల్లి పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలుడిని గుర్తించారు. కాగా బాలుడు ఏలూరు ఎలా? ఎవరితో వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది.

News September 18, 2025

సిరిసిల్ల: జిల్లాకు 10,234 ఇందిరమ్మ ఇండ్లు

image

సిరిసిల్ల జిల్లాకు 10,234 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్లలోని కరెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 10,234 ఇండ్లు మంజూరవ్వగా, 5,308 మార్కింగ్, 2,549 బేస్మెంట్ స్థాయికి, 618 గోడల వరకు, 285 రూఫ్ వరకు, 2 ఇండ్ల నిర్మాణం మొత్తం జరిగిందని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News September 18, 2025

అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

image

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.