News March 9, 2025
ఎన్టీఆర్: నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ అధిష్ఠానం అభ్యర్థులను దాదాపు ఖరారు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి నుంచి వెంకన్న, దేవినేని ఉమా, వంగవీటి రాధా నెట్టెం రఘురాం ఆశావహుల్లో ఉన్నారు. వీరిలో ఎవరిక దక్కుతుందోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆదివారం రాత్రిలోగా అధికారికంగా అభ్యర్థుల ప్రకటన వెలువడనన్నట్లు చెబుతున్నారు.
Similar News
News July 9, 2025
ASF: ఉప్పొంగిన ప్రాణహిత

కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలతో పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత నదులు ఒక్కచోట చేరి తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకాయి. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందువల్ల సమీప గ్రామ ప్రజలు నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
News July 9, 2025
HYD: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.
News July 9, 2025
నష్టాల్లో ముగిసిన సూచీలు.. 25,500 దిగువకు నిఫ్టీ

భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 83,536 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 25,476 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్, ఏషియన్ పేయింట్స్, ఎంఅండ్ఎం, ITC, బజాబ్ ఫైనాన్స్, ఎటర్నల్, NTPC, HDFC బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో, హెచ్‌సీఎల్, ఎల్‌అండ్‌టీ, టైటాన్, ICICI బ్యాంకు షేర్లు నష్టపోయాయి.