News April 12, 2025
ఎన్టీఆర్: పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో లా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన LLB 1వ, BA.LLB 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 22, 24, 26, 29, మే 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
Similar News
News November 9, 2025
ఎండల మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ

టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ గురునాథ రావు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సోమవారం కార్తీకమాసం ఉత్సవం సందర్భంగా భద్రత చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.
News November 9, 2025
కమీషన్ల కోసమే మేడారంలో కాలయాపన: నాగజ్యోతి

మేడారం జాతరకు మరో 70 రోజులే గడువు ఉన్నప్పటికీ పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. కమీషన్ల కోసమే అధికారులు పనుల్లో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పచ్చని మేడారాన్ని ఎడారిలా మార్చేశారని, షాపులు కోల్పోయిన వ్యాపారులకు తక్షణమే ప్రత్యామ్నాయం చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.
News November 9, 2025
తణుకు: బీసీ వసతి గృహంలో కలెక్టర్ తనిఖీలు

తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


