News November 11, 2024

ఎన్టీఆర్: పోలీస్ కమిషనరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎస్పీలు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీలు ప్రజల నుంచి 66 అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను విన్న వారు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వారికి చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

Similar News

News December 22, 2025

అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అట్రాసిటీ కేసుల పరిష్కార చర్యలు, దళితవాడల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు.

News December 22, 2025

టైమ్ బాండ్ ప్రకారం PGRS అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను టైమ్ బాండ్ ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలపై సమీక్షించిన కలెక్టర్ తక్షణమే క్లియర్ చేయాలన్నారు. ఈ-ఆఫీల్ ఫైల్స్ క్లియరెన్స్ లో కూడా చురుగ్గా వ్యవహరించాలన్నారు.

News December 22, 2025

కృష్ణా: పల్స్ పోలియో నిర్వహణలో మన జిల్లాకే స్టేట్ ఫస్ట్.!

image

5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.49% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. 1,45,588 మంది చిన్నారులకు గాను 1,39,024 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.