News March 28, 2024
ఎన్టీఆర్: ప్రయాణికులకు శుభవార్త

ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్ (SC), దిబ్రుగఢ్ (DBRG) మధ్య విజయవాడ మీదుగా నడిచే స్పెషల్ ఫేర్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.07046 SC- DBRG మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి మే 13 వరకు ప్రతి సోమవారం, నం. 07047 DBRG- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు ప్రతి గురువారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు విశాఖపట్నం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News July 5, 2025
సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి: కలెక్టర్

కృష్ణా జిల్లాలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకార సంస్థలు సమ్మిళితమై స్థిరమైన అభివృద్ధి మార్గాలతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ముందుగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, సహకార సంఘాల పతాకాన్ని ఎగురవేశారు.
News July 4, 2025
ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి: కలెక్టర్

జీవితంలో ఒక ఉన్నత లక్ష్యం ఎంచుకొని దానికి అనుగుణంగా కష్టపడి సాధన చేసి అక్కడికి చేరుకోవాలని కలెక్టర్ బాలాజీ పిల్లలకు ఉద్బోధించారు. కలెక్టరేట్‌లో PM కేర్ పథకం కింద కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి గుర్తించిన పిల్లలతో కలెక్టర్ శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి బాగోగులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News July 4, 2025
నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో CSR నిధులు ఉన్నప్పటికీ మైక్రో వాటర్ ఫిల్టర్‌ల నిర్మాణంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని RWS అధికారులను కలెక్టర్ బాలాజీ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా ఫిల్టర్‌లు, అంగన్వాడీ కేంద్రాల్లో వర్షపు నీటి నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. గ్రామాల్లో మైక్రో వాటర్ ఫిల్టర్‌లను నిర్మించడంలో RWS ఇంజినీర్‌లు శ్రద్ద చూపడం లేదని కలెక్టర్ అన్నారు.