News February 5, 2025

ఎన్టీఆర్: ఫైనాన్షియల్ కమిటీలో ఎంపికైన జిల్లా నేతలు వీరే

image

రాష్ట్ర శాసనసభ వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ స్పీకర్ అయన్నపాత్రుడు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కమిటీలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య, MLC మొండితోక అరుణ్(నందిగామ)పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. కాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో ఉన్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News November 4, 2025

చిత్తూరు: ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

image

చిత్తూరులోని ఓ కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కాలేజీలో వారంలోపే రెండో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

News November 4, 2025

తెల్లారకముందే జూబ్లీలో పార్టీల కూత

image

సూర్యుడు ఇంకా ఉదయించక ముందే.. మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూబ్లీ వీధుల్లో వాలిపోతున్నారు. ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను కలుస్తూ నచ్చిన హామీలిస్తున్నారు. ప్రచారానికి వెళ్లడం ఆలస్యమైతే ఓటర్లు పనులకు వెళ్లిపోతారని కాబోలు. ఇక్కడ ఎక్కువ శాతం బస్తీలు ఉండటంతో ప్రజలు ఉపాధి కోసం పనులకు వెళ్తారు. అందుకే నాయకులు ఉదయాన్నే ప్రచారానికి వెళుతున్నారు.

News November 4, 2025

6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు: అ.కలెక్టర్

image

ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పత్తి కొనుగోలు పై మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ పిలుపుమేరకు సీసీ కొనుగోలు కేంద్రాలకు ఆ రోజు పత్తి తీసుకురావద్దని సూచించారు.