News March 21, 2024

ఎన్టీఆర్: బీసీ మంత్రం పని చేసేనా.?

image

మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్‌కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.

Similar News

News September 4, 2025

కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని వినతి

image

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను కోరారు. మచిలీపట్నం పర్యటనకు వచ్చిన మాధవ్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మాధవ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News September 4, 2025

కృష్ణా: యూరియా సరఫరాలో ఇబ్బంది ఉంటే.. ఇలా చేయండి.!

image

జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతుల అవసరాల కోసం ఇతర జిల్లాల నుంచి యూరియాను తెప్పిస్తున్నామని చెప్పారు. శుక్రవారం పల్నాడు జిల్లా నుంచి 300 మెట్రిక్ టన్నులు, పశ్చిమగోదావరి నుంచి 200 మెట్రిక్ టన్నులు వస్తాయని తెలిపారు. ఈ యూరియాను PACS ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని, సమస్యలు ఉంటే 08672-252572లో సంప్రదించవచ్చన్నారు.

News September 4, 2025

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

image

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.