News September 1, 2025

ఎన్టీఆర్: బెంగళూరు వెళ్లే రైలు ప్రయాణికులకు శుభవార్త

image

విజయవాడ మీదుగా దానాపూర్(DNR)- SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం:03251 DNR- SMVB రైలును ప్రతి ఆది, సోమవారాలలో డిసెంబర్ 29 వరకు, నం:03252 SMVB- DNR రైలును ప్రతి మంగళ, బుధవారాలలో డిసెంబర్ 31 వరకు నడుస్తాయన్నారు. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాలలో విజయవాడతో పాటు వరంగల్, ఒంగోలు, గూడూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయన్నారు.

Similar News

News September 4, 2025

శాస్త్రి ఇండో కెనడియన్ ప్రాజెక్టుకు మహిళా వర్సిటీ ఎంపిక

image

కెనడాలోని శాస్త్రి ఇండో కెనడియన్ అంతర్జాతీయ ప్రాజెక్టుకు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఎంపికైనట్లు వీసీ ఆచార్య వి.ఉమ
బుధవారం తెలిపారు. ఈ ప్రాజెక్టు చేయడానికి భారతదేశం నుంచి మొత్తం 30 దేశాలు దరఖాస్తు చేసుకోగా 4 యూనివర్సిటీలు మాత్రమే ఎంపికయ్యాయన్నారు. రెండేళ్ల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టుకు ఏపీ నుంచి పద్మావతి మహిళా వర్సిటీ మాత్రమే ఎంపికవడం గర్వకారణమన్నారు.

News September 4, 2025

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శేషఫణి ఎంపిక

image

నంద్యాల పట్టణ సమీపంలోని బలపనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శేషఫణి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. శేషఫణి పనిచేసిన పాఠశాలలలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఈనెల 5న విజయవాడలో జరిగే గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందుకోబోతున్నారు. పట్టణ ప్రముఖులు శేషఫణికి అభినందనలు తెలిపారు.

News September 4, 2025

అలాంటి లింకులపై క్లిక్ చేయొద్దు: ఎస్పీ

image

గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఏపీకే పేరుతో వచ్చే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దన్నారు. వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తే వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. మీ అనుమతులు లేకుండా ఏవైనా లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు కాల్ చేయాలన్నారు.